Friday, May 2, 2008

నేడు సెజ్‌పై కలెక్టరేట్‌ ముట్టడి

జడ్చర్ల, ఏప్రిల్‌ 27 (న్యూస్‌టుడే): పోలేపల్లి సెజ్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడిస్తున్నట్లు భాజపా జాతీయ కిసాన్‌ మోర్చా సభ్యుడు డా.శౌరీ తెలిపారు. ఆదివారం జడ్చర్ల భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెజ్‌ బాధితులకు అన్యాయంపై పత్రికల్లో కథనాలు ప్రచురితమైనా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. సెజ్‌ నిర్వాసితులకు 2002లో పరిహారం చెల్లించామన్న కలెక్టర్‌ మాటలు వాస్తవం కాదన్నారు. భాజపా ఉద్యమం ప్రారంభమయ్యాక 2007 వరకు కూడా పరిహారాన్ని చెల్లించారని చెప్పారు. గత మార్కెట్‌ ధర అవాస్తమని, అప్పట్లో ప్రభుత్వ ధరను మాత్రమే చెల్లించారన్నారు. పారిశ్రామిక వృద్ధి కేంద్రం భూ సేకరణకు రైతుల సంతకాలు జాబితా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. భూ సేకరణలో భాగంగా రైతు పేర్లతో సంతకాలు ఫోర్జరీ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ ముట్టడిలో నిర్వాసితుల ఆవేదన, సమస్యలను కలెక్టర్‌కు విన్నవిస్తామన్నారు. సెజ్‌ దగ్గర తండా ఉంటుందా..? తొలగిస్తారా..? అనేది అధికారులు తేల్చాలన్నారు. ఈ విషయమై ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ ఎలాంటి సమాధానం చెప్పడం లేదన్నారు.

Courtesy: EenaduDate: 28th April 2008

No comments: